కాట్రేనికోనలో గృహ ప్రవేశ వేడుకకు నేతల హాజరు
జనం న్యూస్ ఆగస్టు 26 ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం
కాట్రేనికోనలో ఎక్స్ ముమ్మిడివరం మార్కెటింగ్ కమిటీ డైరెక్టర్ ఓలేటి సత్యనారాయణ రాజు సత్తిబాబు నూతన గృహ ప్రవేశ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకకు అమలాపురం మాజీ పార్లమెంట్ సభ్యురాలు చింతా అనురాధ, మాజీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ సీనియర్ నాయకులు వై చక్రపాణిరావు (చక్రం )హాజరై నూతన గృహస్తులకు శుభాకాంక్షలు తెలియజేశారు. వాస్తు పూజలు, గృహ ప్రవేశ కార్యక్రమాలు వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఇంటిని మామిడి తోరణాలు, పూలదండలతో అందంగా అలంకరించారు. ఈ కార్యక్రమంలో నేల కిషోర్, కొలాటి సత్యం, నల్లా నరసింహమూర్తి, వల్లభున దొరబాబు, సత్యం కాపు, గంటి సుధాకర్, కోటిపల్లి నరేంద్ర రెడ్డి తదితర నాయకులు, కుటుంబ సభ్యులు, స్థానికులు పాల్గొన్నారు.