శీర్షిక: ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల మహాధర్నాకు ఎస్సీ ఎస్టీ అడ్వకేట్స్ అసోసియేషన్ మద్దతు

August 27, 2026 | వైరల్ వార్తలు

జనం న్యూస్ 27 ఆగస్టు 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట నేడు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు నిర్వహించిన మహాధర్నాకు ఎస్సీ ఎస్టీ అడ్వకేట్స్ అసోసియేషన్ తరపున సంపూర్ణ మద్దతు లభించింది. అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు శ్రీ ఎన్. విజయకుమార్ నేతృత్వంలో సభ్యులు అందరూ ధర్నాలో శాంతియుతంగా పాల్గొని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల న్యాయమైన డిమాండ్లకు తమ సంఘీభావాన్ని ప్రకటించారు.ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు ఎన్ విజయకుమార్ మాట్లాడుతూ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల సమస్యలు తక్షణమే పరిష్కారం కావాల్సిన అవసరం ఉందని వారి న్యాయమైన పోరాటానికి న్యాయవాద వర్గం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. సమాజంలోని అన్ని వర్గాల హక్కుల పరిరక్షణ కోసం సామాజిక న్యాయం కోసం జరిగే ప్రతి ఉద్యమానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ అడ్వకేట్స్ అసోసియేషన్‌కు సంబంధించిన సభ్యులు యాకోబ్ సురేష్ కే విజయ్ కుమార్ నాగయ్య పాల్గొని ధర్నాకు సంఘీభావం తెలిపారు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నాయకులు అడ్వకేట్స్ అసోసియేషన్ చూపిన మద్దతుకు కృతజ్ఞతలు తెలియజేశారు.జారీ చేసినవారు ఎస్సీ & ఎస్టీ అడ్వకేట్స్ అసోసియేషన్ జోగులాంబ గద్వాల జిల్లా

🌐 Select Language:
📰 ePaper