రక్షాబంధన్ రాఖీ ఆత్మీయతా రక్షణకవచం—– సుప్రసిద్ధ చిత్రకారులు రుస్తుం

August 27, 2026 | వైరల్ వార్తలు

జనం న్యూస్ ; 27 ఆగస్టు శుక్రవారం ; సిద్దిపేట నియోజిక వర్గ ఇంచార్జి వై.రమేష్ ;రాఖీ పౌర్ణమి పండుగను పురస్కరించుకుని గురువారం రుస్తుం ఆర్ట్ గ్యాలరీలో “రాఖీ రక్షణ కవచం” రాఖీపున్నమి చిత్రాలను అంతర్జాతీయ చిత్రకారులు రుస్తుం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ. రాఖీపౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ, రాఖీ పౌర్ణమి అక్కాచెల్లి అన్నాతమ్ముళ్ల ఆత్మీయ బంధానికి రక్షణ కవచం రక్షాబంధన్ అని తరతరాలుగా భారతదేశ సంస్కృతులు ఉమ్మడి కుటుంబాల ఆత్మీయత అన్నా చెల్లెల అనుబంధాలు ప్రేమానురాగాలు వాచ్ఛల్యానికి ఎల్లవేళలా విడిపోని బంధమై కళాత్మక జీవన సౌందర్యాన్ని బలోపేతం చేస్తూ నిలువెల్లా పరిమళిస్తుంటాయన్నారు. ప్రపంచ దేశాలకు అంతుపట్టని భారతజాతి సంస్కృతి సంప్రదాయం ఆచార వ్యవహారాలు ఉమ్మడి కుటుంభం భిన్నత్వంలో ఏకత్వం ఐక్యత వారిని మంత్ర ముగ్ధులను చేస్తున్నవని, మన సంస్కృతిని ఎల్లవేళలా కాపాడుకుంటూ రాఖీ పౌర్ణమి అందరి జీవితాల్లో సుఖ సంతోషాలు శాంతి భద్రతలు సౌభాగ్యాలు ఐకమత్యం, రక్షణ కవచంగా పెంపొందించాలని మానవతా చిత్రకారులు రుస్తుం ఆకాక్షించారు. ఈ కార్యక్రమంలోఆర్ ఎ ఎఫ్ అధ్యక్షురాలు జులేఖరుస్తుం, నైరూప్య చిత్రకారుడు నహీంరుస్తుం, నేచర్ ఆర్టిస్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ రుబినారుస్తుం, మహ్మద్ రహీమ్ తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper