బిచ్కుందలో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 17వ వర్ధంతి వేడుకలు

September 2, 2026 | తెలంగాణ

బిచ్కుంద సెప్టెంబర్ 2 మనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలో మార్కెట్ కమిటీ కార్యాలయంలో బుధవారం నాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 17వ వర్ధంతి కార్యక్రమాన్ని బిచ్కుంద కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాగనాథ్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శంకర్ మరియు కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం కాంగ్రెస్ నాయకుడు సీమ గంగారం మాట్లాడుతూ ఆయన ప్రజలకు అందించిన సేవలను నాయకులు, కార్యకర్తలు స్మరించుకున్నారు.ముఖ్యంగా పేద కుటుంబాలకు కార్పొరేట్ వైద్యం అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం వైఎస్సార్ పాలనలో కీలక మైలురాయిగా నిలిచిందని వారు పేర్కొన్నారు. తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న అనేక పేద కుటుంబాలకు ఉచిత వైద్యం అందించి, ఆర్థిక భారం నుంచి వారికి ఉపశమనం కల్పించడంలో ఆరోగ్యశ్రీ ఎంతో ఉపయోగపడిందన్నారు.అలాగే రైతుల సంక్షేమానికి ఉచిత విద్యుత్, రైతు రుణాల మాఫీ, జలయజ్ఞం ద్వారా సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం, పేదలకు ఇళ్ల నిర్మాణం, ఫీజు రీయింబర్స్‌మెంట్, విద్యార్థులకు విద్యా అవకాశాల విస్తరణ వంటి పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు వైఎస్సార్ ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చిందని గుర్తుచేశారు. పేదల జీవితాల్లో ప్రత్యక్షంగా మార్పు తీసుకురావడానికి ఆయన తీసుకున్న నిర్ణయాలు నేటికీ ప్రజల మదిలో నిలిచిపోయాయని అన్నారు.ప్రజల మధ్యే ఉంటూ వారి సమస్యలను తెలుసుకుని, సంక్షేమ పథకాలను నేరుగా ప్రజలకు చేరువ చేసిన నాయకుడిగా వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రత్యేక గుర్తింపు పొందారని పేర్కొన్నారు. ఆయన మరణించి సంవత్సరాలు గడిచినా ప్రజల గుండెల్లో ఆయనపై ఉన్న అభిమానం ఏమాత్రం తగ్గలేదని నాయకులు అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ చైర్మన్ తో పాటు డైరెక్టర్ అశోక్ కాంగ్రెస్ నాయకుడు సీమ గంగారం హనుమంత్ రెడ్డి కామప్ప పటేల్ బాలకృష్ణ వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొని వైఎస్సార్‌కు నివాళులు అర్పించారు.

🌐 Select Language:
📰 ePaper