పరిగిలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై నిరసన

September 2, 2026 | తెలంగాణ

జనం న్యూస్ సెప్టెంబర్ 3,వికారాబాద్ జిల్లా పరిగి: పట్టణంలో నిరసన చేపట్టిన బి ఆర్ ఎస్ నాయకులు, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తవుతున్న సందర్భంగా ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీల అమలులో ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ పరిగి బస్టాండ్ వద్ద పరిగి *మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా కొప్పుల మహేష్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అన్నారు.ప్రజల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తామని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల దృష్టికి తీసుకెళ్తామని కొప్పుల మహేష్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ నిరసనకార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper