టి వై జె ఎఫ్ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా చెల్మెడ అనిల్ కుమార్ నియామకం

September 4, 2026 | తెలంగాణ

జనం న్యూస్ 04-09-2026 సంగారెడ్డి:** తెలంగాణ యూత్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (టి వై జె ఎఫ్) రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా చెల్మెడ అనిల్ కుమార్ నియమితులయ్యారు.టి వై జె ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు డా. తనుగుల జితేందర్ రావు ఆదేశాల మేరకు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మెహబూబ్ ఆధ్వర్యంలో చెల్మెడ అనిల్ కుమార్‌ను రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా నియమించారు. ఈ సందర్భంగా ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం, యువ జర్నలిస్టుల సంక్షేమం కోసం టి వై జె ఎఫ్ మరింత బలోపేతంగా పనిచేయాలని ఆకాంక్షించారు. తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ ఫెడరేషన్ అభివృద్ధికి కృషి చేయాలని చెల్మెడ అనిల్ కుమార్‌ను అభినందించారు.ఈ కార్యక్రమంలో టి వై జె ఎఫ్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు కామగల్ల నరేష్, వర్కింగ్ ప్రెసిడెంట్ సంతోష్ కుమార్ గుప్తా, పట్టణ ఉపాధ్యక్షులు మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper