జుక్కల్ చౌరస్తా బస్సు ప్రమాదం – బిచ్కుంద ఆసుపత్రికి చేరుకున్న ఎమ్మెల్యే

September 4, 2026 | తెలంగాణ

బిచ్కుంద సెప్టెంబర్ 4 జనం న్యూస్ :జుక్కల్ చౌరస్తాలో జరిగిన బస్సు ప్రమాద ఘటనలో మొత్తం 13 మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ మృతి చెందగా, మరో 12 మంది గాయపడ్డారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే జుక్కల్ ఎమ్మెల్యే శ్రీ తోట లక్ష్మీకాంతారావు బిచ్కుంద ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని క్షతగాత్రులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు.గాయపడిన వారిలో ఒకరికి తలకు తీవ్ర గాయం కావడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. మిగిలిన క్షతగాత్రులకు బిచ్కుంద ఆసుపత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు.క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యాధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని బాధిత కుటుంబాలకు భరోసా ఇచ్చారు.

🌐 Select Language:
📰 ePaper