మట్టి గణేష్ విగ్రహాల ప్రోత్సాహానికి ప్రాధాన్యం

September 4, 2026 | తెలంగాణ

పర్యావరణ పరిరక్షణే లక్ష్యమంటున్న నూతన అధ్యక్షుడు. యక్కంటి వెంకటరెడ్డి

జనం న్యూస్ సెప్టెంబర్ 4 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి జై గణేష్ భక్తి సమితి తెలంగాణ రాష్ట్రం కూకట్‌పల్లి నియోజకవర్గ అధ్యక్షుడిగా యక్కంటి వెంకటరెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఏ. జైన్ కుమార్, చైర్మన్ కే.ఎస్. ఆనంద్ రావు చేతుల మీదుగా యక్కంటి వెంకటరెడ్డికి నియామక పత్రాన్ని అందజేశారు.గత ఆరు సంవత్సరాలుగా యక్కంటి వెంకటరెడ్డి మట్టి గణేష్ విగ్రహాల పంపిణీ, ప్రతిష్ఠాపన, పూజా కార్యక్రమాలను నిర్వహిస్తూ పర్యావరణ పరిరక్షణతో పాటు భక్తి, సంప్రదాయాల పరిరక్షణకు విశేషంగా కృషి చేస్తున్నారు. ఆయన చేస్తున్న నిరంతర సేవలను గుర్తించిన జై గణేష్ భక్తి సమితి కూకట్‌పల్లి నియోజకవర్గ బాధ్యతలను అప్పగించింది.ఈ సందర్భంగా యక్కంటి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. మట్టి గణేష్ విగ్రహాల వినియోగాన్ని మరింతగా ప్రోత్సహించడమే తన ప్రధాన లక్ష్యమన్నారు. వినాయక చవితి సందర్భంగా పర్యావరణానికి హాని కలగకుండా మట్టి విగ్రహాలను ఉపయోగించేలా ప్రజల్లో విస్తృత అవగాహన కల్పిస్తామని తెలిపారు. సమితి ఆశయాలను కూకట్‌పల్లి నియోజకవర్గంలోని ప్రతి ప్రాంతానికి తీసుకెళ్లి భక్తి, సంప్రదాయాలతో పాటు పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తామని పేర్కొన్నారు.నూతనంగా నియమితులైన యక్కంటి వెంకటరెడ్డికి భక్తులు, సేవాభిమానులు, పలువురు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఆధ్వర్యంలో కూకట్‌పల్లి నియోజకవర్గంలో మట్టి గణేష్ విగ్రహాల వినియోగం మరింత విస్తరించాలని ఆకాంక్షించారు.

🌐 Select Language:
📰 ePaper