కొత్తకోట నూతన సీఐరమేష్కు శుభాకాంక్షలు తెలిపిన. మున్సిపల్ చైర్మన్ అక్కి శ్రీనివాస్ గౌడ్.
జనం న్యూస్ : వనపర్తి డివిజన్ రీపోటర్ కటికల శివకుమార్ పెబ్బేరు వనపర్తి జిల్లా సెప్టెంబర్ 04-09-2026 శుక్రవారం కొత్తకోట సర్కిల్ ఇన్స్పెక్టర్ (సీఐ)గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఓ.డి. రమేష్‌ను పెబ్బేరు మున్సిపల్ ఛైర్మన్ అక్కి శ్రీనివాస్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఐని శాలువతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు._ పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణకు, ప్రజా సమస్యల పరిష్కారానికి పోలీస్ యంత్రాంగానికి మున్సిపాలిటీ తరఫున పూర్తి సహకారం అందిస్తామని ఛైర్మన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు._ బాధ్యతలు స్వీకరించిన సీఐ ఓ.డి. రమేష్ మాట్లాడుతూ.. ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానంలో ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని, అసాంఘిక కార్యకలాపాలపై కఠినంగా వ్యవహరిస్తానని తెలిపారు. శాంతిభద్రతల నిర్వహణలో ప్రజలు, ప్రజాప్రతినిధులు సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సురేందర్ గౌడ్, మార్కెట్ డైరెక్టర్లు రామన్ గౌడు, మోతే రాములు, రాములు యాదవ్, పాల్గొన్నారు.END