డిజిటల్ క్రాఫ్ట్ సర్వే చేస్తున్న పంటలను పరిశీలించి బుకింగ్

జుక్కల్ సెప్టెంబర్ 3 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండలం అవల్గోవ్ మరియు కోడిచిర గ్రామంలో డిజిటల్ క్రాప్ సర్వే చేస్తున్న పంటలను పరిశీలించి క్రాప్ బుకింగ్ సర్వే త్వరగా చేయాలని ఆయా గ్రామాల ఏఈవోలకు మండల వ్యవసాయ అధికారి సూచించడం జరిగింది.రైతులు అందుబాటులో ఉండి ఏ సర్వేలో ఏ పంట సాగు చేస్తున్నారో వివరాలు ఏఈవోల వద్ద నమోదు చేసుకోవాలని సూచించడం జరిగింది.అలాగే కోడిచిర గ్రామంలో సాగు చేస్తున్న సోయాబీన్ పంటను క్షేత్ర సందర్శన చేసి రైతులకు సస్యరక్షణ సూచనలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఈవో లు సౌమ్య శ్రీ, రాజహిత మరియు రైతులు పాల్గొన్నారు.