నేడుశ్రీ రుక్మిణి, సత్యభామ సమేత శ్రీ కృష్ణకళ్యాణ మహోత్సవం

September 3, 2026 | తెలంగాణ

జనం న్యూస్ నందలూరు కడప జిల్లా నందలూరు మండల కేంద్రంలోని నాగిరెడ్డిపల్లి మేజర్ .గ్రామ పంచాయతీ పరిధిలోగల అరవపల్లె శ్రీ కృష్ణ గీత మందిరం నందు శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ కృష్ణ కళ్యాణం మహోత్సవం నిర్వహించ నున్నట్లు ఆలయ కమిటీ నిర్వాహకులు కుర్ర మణి యాదవ్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రావణ బహుళ అష్టమి సందర్భంగా 3వతేదీ గురువారం భారతాల శ్రీధర్ యాదవ్, సుప్రియ దంపతులచే సాయంత్రం 5 గంటలకు మూల విరాట్లు, ఉత్సవ మూర్తులకు అభిషేక కార్యక్రమం, ఘనంగా నిర్వహించారు ఈ కార్య క్రమంలో శ్రీకృష్ణ పాద సేవకులు పాల్గొన్నారు. 4న ఉదయం 8గంటలకు గోపూజ, ఉదయం 9 నుంచి 10:30 గంటల మధ్య శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ కళ్యాణం అనంతరం,పుష్పయాగం ,నవవిధహారతులు,ఉంటాయన్నారు, కళ్యాణానికి వచ్చే మహిళలకు పసుపు, కుంకుమ, గాజులు, దారం, ముత్యాల తలంబ్రాలు అంద జేయనున్నట్లు ఆయన తెలిపారు.

🌐 Select Language:
📰 ePaper