హిల్ కాలనీలో కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు

September 3, 2026 | తెలంగాణ

జనం న్యూస్- సెప్టెంబర్ 3 – నాగార్జునసాగర్ టౌన్-కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజుల ప్రజా పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా నాగార్జున సాగర్ నందికొండ మున్సిపాలిటీ పరిధిలోని హిల్ కాలనీ విజయ విహార్ వద్ద ఆ పార్టీ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా సంబరాలు నిర్వహించారు. మున్సిపల్ వైస్ చైర్మన్ గొడవర్తి రాజా ప్రసాద్ అధ్యక్షతన ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు,ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ మానసా స్వర్ణ రాష్ట్ర నాయకులు కర్ణ బ్రహ్మానందరెడ్డి,హాజరయ్యారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకుంటూ ప్రభుత్వ విజయాలను గుర్తు చేసుకున్నారు,ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని, ఇచ్చిన హామీలను అమలు చేస్తూ అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తోందని తెలిపారు,ఈ వేడుకల్లో మున్సిపల్ కౌన్సిలర్లు ఈర్ల రామకృష్ణ, పగడాల నాగరాజు,మంద గౌతమి రఘువీర్ బిన్నీ,సాగర్ బాబు,పార్టీ నాయకులు కృష్ణారెడ్డి,ఓబీసీ నాయకులు జంగన్న,ఉంగరాల శ్రీను, వెంకటేష్,రాజేష్‌తో పాటు పలువురు పార్టీ కార్యకర్తలు,అభిమానులు పాల్గొన్నారు

🌐 Select Language:
📰 ePaper