చెయ్యేరు, కాట్రేనికోనలో ప్రత్యేక గ్రామ సభలు… ఓటరు జాబితా ముసాయిదాపై చర్చ

September 3, 2026 | ఆంధ్రప్రదేశ్

జనం న్యూస్ సెప్టెంబర్ 3 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం చెయ్యేరు, కాట్రేనికోన గ్రామ పంచాయతీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటరు జాబితా ముసాయిదాకు సంబంధించి ప్రత్యేక గ్రామ సభలు ఎంపీడీఓ, ప్రత్యేకాధికారి బి రాజేశ్వర్ రావు ఆధ్వర్యంలో నిర్వహించారు. పోలింగ్ స్టేషన్లు, ఓటరు జాబితాలపై అభ్యంతరాలు, తదుపరి కార్యాచరణపై గ్రామ పెద్దలతో చర్చించారు. అనంతరం ఎంపీడీఓ చెయ్యేరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను గ్రామ పెద్దల సమక్షంలో సందర్శించి మధ్యాహ్న భోజన పథకం నాణ్యతను పరిశీలించారు. స్వయంగా భోజనం రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. మెనూ సక్రమంగా అమలు చేయాలని, విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని నిర్వాహకులను ఆదేశించారు. ఉపాధ్యాయులతో మాట్లాడుతూ నాణ్యమైన విద్య అందించాలని, విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాలను మెరుగుపరచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు నడింపల్లి సుబ్బరాజు, మాజీ సర్పంచ్ చెల్లి సురేష్, ఎంపీటీసీ సూర్య మహాలక్ష్మి, కార్యదర్శులు భాగయ్య, జె వి సత్యన్నారాయణ, సిబ్బంది పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper