అతిధి అధ్యాపక పోస్టులకు ఇంటర్వ్యూ

September 3, 2026 | తెలంగాణ

జనం న్యూస్ ;3 సెప్టెంబర్ గురువారం: సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై. రమేష్ :ప్రభుత్వ డిగ్రీ కళాశాల సిద్దిపేట అటానమస్ లో పి.జి కోర్స్ లకు బోదించుటకు అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జి.సునీత ఒక ప్రకటనలో తెలియజేశారు.పోస్టుల వివరాలు:ఎం స్సీ,ఫిజిక్స్ , కెమిస్ట్రీ , బాటనీ , మైక్రోబయాలజీ , జువాలాజి లజీ ,ఫిషరీస్ ,కంప్యూటర్ సైన్స్ .ఎం . కామ్ఎం .ఏ తెలుగు , ఎకనామిక్స్ , పొలిటికల్ సైన్స్ , హిస్టరీపోస్టులు ఉన్నాయని తెలియజేశారు.వీటికి దరఖాస్తు చేసుకొనే అభ్యర్ధులు సంబంధిత పి.జి.సబ్జెక్టు లో 55శాతం మార్కులు వుండాలి. ఎస్సి మరియు ఎస్టి అభ్యర్ధులకు 50 శాతం మార్కులు వుండాలి. నెట్, సెట్, మరియు పి.హెచ్.డి ఉన్నవారికి ప్రాదాన్యం వుంటుంది. దానితోపాటు పి. జి స్థాయిలో బోధన అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది .దరఖాస్తు చేసుకొనే వారు తేది 05.09.2026 రోజున 12.00 గంటల లోపు హజురైన వారికి కళాశాలలో ఇంటర్వ్యూలు నిర్వహించబడుతాయి. సంబధిత ఒరిజినల్ సర్టిఫికెట్స్ మరియు వాటి యొక్క ఒక్క సెట్ జిరాక్స్ పత్రాలతో హాజరుకావాలని ప్రిన్సిపాల్ సూచించారు.

🌐 Select Language:
📰 ePaper