ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

September 4, 2026 | తెలంగాణ

కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే విజయ్‌కుమార్

జనం న్యూస్, సెప్టెంబర్ 04,అచ్యుతాపురం : శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఎలమంచిలి నియోజకవర్గం రాంబిల్లి మండలం సంతపాలెం గ్రామంలో కృష్ణాష్టమి వేడుకలను వైభవంగా నిర్వహించారు. వేడుకలకు ఎలమంచిలి నియోజకవర్గ ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా గ్రామంలోని శ్రీకృష్ణ ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం ఉట్టి ఉత్సవంతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్ మాట్లాడుతూ ధర్మాన్ని పరిరక్షించి, సమాజంలో శాంతియుతమైన జీవనాన్ని అందించడమే శ్రీకృష్ణుడి సందేశం. జగద్గురువు శ్రీకృష్ణుని ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాను. అని ఆకాంక్షించారు…కృష్ణాష్టమి పర్వదినం సందర్భంగా గ్రామంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించిన కార్యక్రమాల్లో కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, ప్రజలు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper