ప్రత్యేక ఓటరు నమోదు శిబిరాలను వినియోగించుకోగలరు
*మద్నూర్ తహసీల్దార్ ఎం.డి. ముజీబ్ పిలుపు*
మద్నూర్ సెప్టెంబర్ 4 జనం న్యూస్ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ – SIR ప్రక్రియలో భాగంగా మద్నూర్ మండల పరిధిలో *ప్రత్యేక ఓటరు నమోదు శిబిరాలను* ఏర్పాటు చేసినట్లు అసిస్టెంట్ ఎన్నికల నమోదు అధికారి మరియు తహసీల్దార్ *ఎం.డి. ముజీబ్ గారు* శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.*శిబిరాలు నిర్వహించే తేదీలు:* *Dt: 05.09.2026 & Dt: 06.09.2026* *Dt: 12.09.2026 & Dt: 13.09.2026*ఈ నాలుగు రోజుల పాటు మండలంలోని అన్ని గ్రామాలలో గ్రామ పంచాయతీ, పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక ఓటరు నమోదు శిబిరాలు పని చేస్తాయని ఆయన పేర్కొన్నారు.18 సంవత్సరాలు నిండిన యువత, పేరు నమోదు కాని వారు, చిరునామా మారినవారు, పేరులో తప్పులు ఉన్నవారు ఈ శిబిరాలకు వచ్చి ఫారం-6, ఫారం-7, ఫారం-8 ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చని తెలిపారు. BLO లు శిబిరాల వద్ద అందుబాటులో ఉంటారని, ఆధార్ కార్డు, ఫోటో మరియు చిరునామా రుజువులతో రావాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఓటు హక్కును నమోదు చేసుకోవాలని AERO & తహసీల్దార్ ఎం.డి. ముజీబ్ గారు కోరారు.