ధర్మం, న్యాయం, మానవ విలువలకు మార్గదర్శకుడు శ్రీకృష్ణుడు
పి.గన్నవరంలో శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్
జనం న్యూస్ సెప్టెంబర్ 4 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరంలో పవిత్ర వైనతేయ నది తీరంలో వెలసిన శ్రీ పట్టాభిరామస్వామి ఆలయంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
మంత్రి జన్మస్థల పూజ, ఎడ్లబండిలో స్వామివారి ఊరేగింపు, సుదర్శన నరసింహ హోమం, అభిషేకం తదితర ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ “కృష్ణం వందే జగద్గురుమ్” అని పేర్కొన్నారు. శ్రీకృష్ణుడు ధర్మం, న్యాయం, మానవ విలువలకు మార్గదర్శకుడని, భగవద్గీత సందేశం సమాజానికి శాశ్వత స్ఫూర్తిగా నిలుస్తుందని అన్నారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులు, సుభిక్షంతో జీవించాలని ఆకాంక్షించారు. రామసేతు భక్త బృందం మరియు గరుడవేగ టీం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో పి గన్నవరం కో కన్వీనర్ మోకా ఆనందసాగర్, బిజెపి ఎక్స్ ఎమ్మెల్యే అయ్యో జి వేమ ,టిడిపి నాయకులు షేరు శ్రీనుబాబు, నిమ్మకాయల శేషు, భక్తులు, గ్రామ ప్రజలు, ఆలయ నిర్వాహకులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.