ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన జిల్లా అధ్యక్షులు గుత్తుల సాయి
జనం న్యూస్ సెప్టెంబర్ 4 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గుత్తుల సాయి, జోన్ 2 ఇంచార్జి రావు సుజయకృష్ణ రంగారావును రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉండవల్లి నివాసంలో కలిశారు. ఈ నెల 9వ తేదీన కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో జరగనున్న ముఖ్యమంత్రి పర్యటన, డోర్ టు డోర్ కార్యక్రమం, త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపై సమగ్రంగా చర్చించారు. పార్టీ శ్రేణులు ప్రజల వద్దకు వెళ్లి ప్రభుత్వ పథకాలను వివరించాలని, బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి దిశా నిర్దేశం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలకు అందరం సిద్ధంగా ఉండాలని సూచించారు. ఈ సమావేశంలో రాష్ట్ర అటవీశాఖ కార్పొరేషన్ అధ్యక్షులు, మాజీ మంత్రి రావు సుజయకృష్ణ రంగారావు పాల్గొన్నారు.