ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం. రాఘవ స్వచ్ఛంద సంస్థ

September 5, 2026 | తెలంగాణ

జనం న్యూస్ 4 ఆలేరు యాదాద్రి జిల్లా మండల రిపోర్టర్ ఎండి జహంగీర్ ఆలేరులో ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని రాఘవ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో బండి రాజుల శంకర్ సభ అధ్యక్షతన ఉపాధ్యాయ దినోత్సవo శనివారం రోజున ఘనంగా జరిగినది కార్యక్రమానికి జిల్లా జడ్పీ డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చిలుకూరి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు.
ముఖ్య అతిథి చిలుకూరి శ్రీనివాస్ మాట్లాడుతూ, ఒక మంచి ఉపాధ్యాయుడు వందలాది మంది విద్యార్థుల జీవితాలను ప్రభావితం చేయగలడని అన్నారు. విద్యార్థులు తమ గురువులను గౌరవిస్తూ, వారు చూపించే మంచి మార్గంలో నడిచి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో గొప్పదని పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే శిల్పులు ఉపాధ్యాయులేనని . ఉపాధ్యాయుల సేవలకు ఎంత గౌరవం ఇచ్చినా తక్కువేనని, ప్రతి విద్యార్థి తన జీవితంలో ఎదిగినప్పుడు తన గురువులను గుర్తు చేసుకోవాలని సూచించారు. విద్యతో పాటు మానవతా విలువలను పెంపొందించడంలో ఉపాధ్యాయులు మరింత కీలక పాత్ర పోషించాలని అన్నారు.ఈ సందర్భంగా రాఘవ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు పులిపలుపుల మహేష్ మాట్లాడుతూ, సమాజానికి సేవ చేయాలనే లక్ష్యంతో సంస్థ అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోందని విద్యార్థుల భవిష్యత్తుకు మార్గదర్శకులైన ఉపాధ్యాయులను గౌరవించడం తమ సంస్థకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. భవిష్యత్తులో విద్య, వైద్యం, సామాజిక సేవా రంగాల్లో మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.కార్యక్రమంలో కంతుల శంకర్ ఐలి సందీప్ కళ్లెం జితేందర్ మొరిగాడి సిద్దులు గుండ్రజు నరసింహారాజు ఉపాధ్యాయులు, విద్యార్థులు, రాఘవ స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు, స్థానిక ప్రముఖులు, తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper