జిల్లా కలెక్టర్ కి వినతిపత్రం అందజేసిన దివ్యాగుంలు ఉదయ్ అసోసియేషన్
జనం న్యూస్ 09 సెప్టెంబర్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ జోగుళాంబ గద్వాల జిల్లా ఈరోజు మన ఉదయ్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం శ్రీనివాసులు మరియు అసోసియేషన్ మహిళ ప్రతినిధులు రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్) కిరణ్మయి ఎ ఐ యస్ మేడమ్ ని కలిసి వినతిపత్రం సమర్పించాము.
చర్చించిన ప్రధాన అంశాలు మేడమ్ స్పందన యస్ ఆర్ డి& 4% రిజర్వేషన్: అన్ని ప్రభుత్వ శాఖల్లో 4% రిజర్వేషన్ రోస్టర్ ప్రకారం బ్యాక్‌లాగ్ ఖాళీల వెరిఫికేషన్ చేసి స్పెషల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ (యస్ ఆర్ డి ) వేగవంతం చేయడానికి అన్ని శాఖల అధికారులతో త్వరలోనే సమీక్ష నిర్వహిస్తామని చెప్పారుఅంగన్‌వాడీ వయోపరిమితి అంగన్‌వాడీ పోస్టుల నియామకాల్లో దివ్యాంగులకు వయోపరిమితి పెంపు సడలింపు ఇచ్చేలా ఉదయ్ తరఫున ప్రభుత్వానికి ప్రత్యేక లేఖ రాస్తామని హామీ ఇచ్చారు ఉదయ అసోసియేషన్. తెలంగాణ.