వరుస పండగలలో ఆక్రమణలను తొలగించడం సరికాదు

September 10, 2026 | తెలంగాణ

గత 50 సంవత్సరాల నుండి రహదారుల అక్రమణాలను చూస్తూ ఊరుకున్న అధికారులు ఇప్పుడు హిందూ ముస్లిం క్రిస్టియన్ల పండుగలు వస్తున్న వేళ వ్యాపార సముదాయాల దగ్గర రోడ్ల విస్తీర్ణ పేరుతో అక్రమణాలను తొలగించడం సరికాదు

జనం న్యూస్10-09-2026 పి. రాములు నేత జాగో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జహీరాబాద్ పట్టణంలో గత 50 సంవత్సరాల నుండి రోడ్లను ఆక్రమించుకొని వ్యాపారాలు నిర్వహిస్తున్న వారికి పూర్తి సహకారం అందించిన పురపాలక సంఘం అధికారులు నేటి ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని పెద్ద ఎత్తున స్పందిస్తూ రోడ్ల మీదికి వచ్చి వ్యాపారాలు నిర్వహిస్తున్న వ్యాపారుల సముదాయాలను తొలగించడం స్వాగతించదగ్గ విషయమే కానీ దానికి ఇప్పుడు సందర్భం కాదు కొద్దిగా వెసులుబాటు కల్పించాలి ఎందుకంటే వరుసగా హిందువులు ముస్లింలు క్రైస్తవులకు సంబంధించిన పండగలు సెప్టెంబర్ నుండి జనవరి వరకు పండుగలు వస్తుంటాయి వాస్తవానికి జహీరాబాద్ పట్టణంలో పెద్ద పెద్ద మాల్స్ రావడంతో చిరు వ్యాపారులు ఇప్పటికే కుదేలైపోయినారు ఆర్థికంగా పెద్ద ఎత్తున నష్టపోయి ఉన్నారు బిక్కుబిక్కుమంటూ వ్యాపారాలు ఇలాంటి చిరు వ్యాపారాలు పండుగల వేళ కొద్దిగా జోరందుకుంటాయని ఆశతో ఎదురుచూస్తున్న తరుణంలో వారి వ్యాపార సముదాయాల ముందు చిన్నాభిన్నం చేస్తే వాళ్ళు వ్యాపారం చేసుకోవాలా లేక వాళ్ళ షాపులను రిపేరు చేసుకోవాలా దయచేసి స్థానికంగా ఉన్న పెద్ద నాయకులు అధికారులు ఒకసారి మానవత్వ కోణంలో ఆలోచించండి జోనల్ చట్టాలను తుంగలో తొక్కి స్థానికంగా ఉన్న అధికారులు ముఖ్యంగా అగ్నిమాపక భద్రతాధికారులు పురపాలక అధికారులు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ చిరు వ్యాపారులను కృంగదీస్తూ పెద్ద పెద్ద కార్పొరేట్ వ్యాపారుల కొమ్ముకాస్తున్నారు సరైన ప్రభుత్వ నిబంధనలు పాటించకున్నప్పటికీని వారికి అనేక రకాల అనుమతుల ధ్రువపత్రాలు జారీ చేసి జహీరాబాద్ లో పెద్ద పెద్ద వ్యాపారులకు అండగా నిలుస్తున్నారు ఇప్పటికే జహీరాబాద్ లో అనేక రకాల మోసపూరిత వ్యాపారాలు కొనసాగిస్తున్న పట్టించుకునే నాథుడే లేదు ఒకవైపు ఇక్కడున్న ప్రజాప్రతినిధులు కనీసం ప్రాంతీయులకు కృంగదీసి బయట నుండి విచ్చేసి గారడి వ్యాపారాలు చేస్తున్న వారి వైపు దృష్టి సారించలేకపోవడం శోచనీయం బాధాకరం జహీరాబాద్ లో స్థానికేతర్లు అంతర్ రాష్ట్రాల వాళ్లు వాళ్ళ ఇష్టం వచ్చిన వ్యాపారాలను ప్రారంభించి అనేక రకాల మోసాలకు పాల్పడుతున్నారు ఈ విషయాలను ప్రజలు గమనించి మోసపూరితమైన వ్యాపారుల బారిన పడకుండా జాగ్రత్తపడాలి ముఖ్యంగా భవన నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులకు కమిషన్ల ఎరచూపి అనేక రకాల నాణ్యతలేని వస్తువులను వినియోగదారులకు అంట కడుతున్నారు ఈ నాణ్యతలేని వస్తువులు వాడి కొన్ని సందర్భాలలో ప్రజలు అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నారు ముఖ్యంగా ఎలక్ట్రికల్ వస్తువులు పెయింట్ హార్డ్వేర్ శానిటేషన్ కల్తీ నకిలీ తినుబండరాలను కూడా విక్రయిస్తున్నారు ప్రజలు ఇవన్నీ కూడా జాగ్రత్తగా గమనించాలి దయచేసి జహీరాబాద్ ప్రాంతీయంగా ఉన్న చిరు వ్యాపారులకు ప్రోస్థాన్ని అందించి వారి సముదాయాల ముందు ఏమైనా రోడ్లపైకి వచ్చినట్టయితే జనవరి నెల వరకు వారికి అవకాశం ఇచ్చి ఆదుకోవాలని జాగో తెలంగాణ తరఫునుండి అధికారులకు కోరుచున్నాము అంతే కాకుండా అంతర్ రాష్ట్రాల నుండి ఇక్కడికి విచ్చేసిన వ్యాపారులు వారు నిర్వహిస్తున్న వ్యాపారాలు వారు పాటిస్తున్న ప్రభుత్వ నిబంధనలను సరైన విధంగా ఉన్నాయా లేదా అనే విషయాలను అధికారుల సమావేశం నిర్వహించి మన ప్రాంత ప్రజా ప్రతినిధులు వారి పైన కూడా ఒక దృష్టి సారించి ప్రజలకు భద్రత మరియు నాణ్యమైన వస్తువులు అందేలా చూడాల్సిన బాధ్యత కూడా ప్రాంత ప్రజా ప్రతినిధులపై ఉన్నదనే విషయాన్ని తెలియజేస్తూ కార్యక్రమంలో జాగో తెలంగాణ కార్యవర్గ సభ్యులు పి.అరవింద్ సన్నీ మొదలగు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు

🌐 Select Language:
📰 ePaper