నిమజ్నో త్సవానికి నీళ్లు ఇవ్వండి అనకాపల్లి ఆర్డీవో షేక్ ఆయిషాని కలిసిన వినాయక ఉత్సవ నిమజ్జనోత్సవ కమిటీ
జనం న్యూస్ సెప్టెంబర్ 10 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ సెప్టెంబర్ 14వ తేదీన జరిగే వినాయక చవితి వినాయక నవరాత్రులు చివరి నిమజ్జోత్సవం సెప్టెంబర్ 23 తేదీ న శారదా నదిలో సెప్టెంబర్ 14వ తేదీన సుమారు 25,000 మట్టి ప్రతిమలు సెప్టెంబర్ 23 న 200 ఆపై పెద్ద విగ్రహాలు నిమజ్జనొత్సవ కార్యక్రమానికి వస్తాయని ఇప్పటికే చాలా నదిలో నీళ్లు చాలా తక్కువగా ఉన్నాయని గణపతి యొక్క తల్లి అయినటువంటి పార్వతి దేవి గంగాదేవి తన కుమారుడిని ఒడిలో చేర్చుకొనుటకు ప్రకృతి సిద్ధమైనటువంటి నీళ్లు వస్తాయని మాకు పూర్తిగా ధైర్యం ఉన్నదని అయినప్పటికీ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు పాలిథిన్ కవర్స్ మరియు పర్యావరణ హాని చేసే వస్తువులను అటు ప్రజలు కూడా నదిలో పడేస్తున్నారని అధికారులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని దీనివల్ల కాలమానం మారిపోయి వర్షాకాలంలో కూడా కొన్ని సందర్భాల్లో నీళ్లు కరువవుతున్నాయని కావున ముందు జాగ్రత్తగా సెప్టెంబర్ 14వ తేదీ సెప్టెంబర్ 23వ తేదీన శారదా నదిలో నీళ్లు వదలాలని. గణపతి నిమజ్జనానికి ఏ ఆటంకం కలగకూడదని ఈ సందర్భంగా ఆర్డీవో ని వినాయక ఉత్సవ నిమజ్జనోత్సవ కమిటీ వ్యవస్థాపక అధ్యక్షులు ఆడారి కుమారస్వామి కమిటీనేతలు. దాడి బుజ్జి, బొడ్డు వీరభద్రరావు, బొడ్డేడ ఈశ్వర్, చదరం మహేష్ తదితర నేతలు ఆర్డీవో ని కలిసి వినతి పత్రాన్ని అందజేసిరి. దీనిపై స్పందించిన ఆర్డిఓ షేక్ ఆయిషా. తప్పనిసరిగా అధికారులతో మాట్లాడి నిమజ్జనానికి ఏ ఇబ్బంది లేకుండా అన్నిఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారని ఉత్సవ కమిటీ చైర్మన్ ఆడారి కుమార స్వామి తెలిపారు.//