వర్షాలు కురవాలని ప్రత్యేక పూజలు
జనం న్యూస్, సెప్టెంబర్ 10,అచ్యుతాపురం : అచ్యుతాపురం మండలం చోడపల్లి గ్రామంలో వర్షాలు రాకపోవడంతో పంటలు,పశువులు తీవ్ర కష్ట కాలంలో ఉండటం వల్ల మన పురాతన కాలం నుంచి తాత ముత్తాతలు నుంచి వస్తున్న ఆచారం వర్షాలు సకాలంలో పడకపోతే పాండవులకు పాలు పొంగించడం చోడమాంబికా అమ్మవారు లోవ చిట్టచివర పంచ పాండవులకు పాలు పొంగించి మన గ్రామం నుంచి సుమారుగా 3కిలోమీటర్లు దూరం వెళ్ళి పంచపాండవులకు పాలు పొంగించే కార్యక్రమం కాకి శంకర్ రావు అధ్వర్యంలో పూజా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ఈ రోజు ఉదయం 10 గంటలకు వెళ్ళేటప్పుడు మంచి ఎండ ఉందని పూజా కార్యక్రమం ముగించకముందే పెద్ద వర్షం పడటం మా గ్రామ దేవత శ్రీశ్రీశ్రీ చోడమాంబికా మనకు అన్ని విధాల మనకు తోడువుండటం శుభసూచకం అని అన్నారు.ఈ కార్యక్రమంలో కాకి సోమనాయుడు, కాకి రాంబాబు, కె అవతారం, కాకి శంకర్, కాకి రమణ, అనుసూరి అప్పలనాయుడు, వడిసెల నాగేశ్వరరావు, రాంబాబు, శివాజీ,కుక్కర సత్యనారాయణ పంతులు
తదితరులు పాల్గొన్నారు.