తెలంగాణ

సీఎం రేవంత్ రెడ్డి సహకారం బండి రమేష్ చొరవతో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు

సీఎం రేవంత్ రెడ్డి సహకారం బండి రమేష్ చొరవతో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు

జనం న్యూస్ సెప్టెంబర్ 12 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి అనారోగ్యంతో బాధపడుతూ వైద్య ఖర్చులు భరించలేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పలువురు లబ్ధిదారులు కూకట్పల్లి శ్రీ హేమదుర్గ భవన్‌లోని బండి రమేష్ కార్యాలయాన్ని సంప్రదించి, సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సహాయం అందించాలని కోరారు లబ్ధిదారుల విజ్ఞప్తిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి, సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సహాయం అందేలా శ్రీ బండి రమేష్ చొరవ తీసుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో, బండి రమేష్ కృషి ఫలితంగా మొత్తం రూ.3,32,500/- విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు మంజూరయ్యాయి. శనివారం శ్రీ హేమదుర్గ భవన్‌లోని కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బండి రమేష్ లబ్ధిదారులకు చెక్కులను స్వయంగా అందజేశారు.చెక్కులు అందుకున్న లబ్ధిదారుల వివరాలు:పొట్టేటి గౌతమి, కేర్ ఆఫ్ పొట్టేటి రవీందర్ రూ.60,000/-గౌసియా బేగం, డాటర్ ఆఫ్ మొహమ్మద్ దస్తగిరి రూ.50,000/-తమ్మిరి కృష్ణవేణి, కేర్ ఆఫ్ రామాచారి రూ.60,000/-దేవుళ్ల నీలం రాజు, సన్నాఫ్ దేవుళ్ల ప్రకాష్ రూ.60,000/-కడిపప్పుల్ ఫ్రాన్సిస్, సన్నాఫ్ వెంకట రత్నం రూ.42,500/-మండల చంద్రకళ, కేర్ ఆఫ్ రామిరెడ్డి రూ.60,000/-ఈ సందర్భంగా లబ్ధిదారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి, తమ సమస్యను పరిష్కరించేందుకు చొరవ చూపిన బండి రమేష్ కి కృతజ్ఞతలు తెలిపారు. కష్టకాలంలో తమకు అండగా నిలిచినందుకు ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో లక్ష్మయ్య, నాగార్జున, శివ చౌదరి, నలినీకాంత్, వరుణ్, జహంగీర్, సజ్జన్, సంధ్య, జోజమ్మ, కల్పన, రజిని, మారుతి తదితరులు పాల్గొన్నారు.

ఇ-పేపర్