తెలంగాణ

వసంత నగర్ డివిజన్లో మలేషియన్ టౌన్షిప్ లో వేడుకగా గణేష్ విగ్రహాల పంపిణీ కార్యక్రమం

వసంత నగర్ డివిజన్లో మలేషియన్ టౌన్షిప్ లో వేడుకగా గణేష్ విగ్రహాల పంపిణీ కార్యక్రమం

జనం న్యూస్ సెప్టెంబర్ 13 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి వినాయక చవితి పండుగను పురస్కరించుకొని స్థానిక వసంత నగర్ డివిజన్ లో మలేషియన్ టౌన్షిప్స్లో ఎకో ఫ్రెండ్లీ గణేష్ విగ్రహాల పంపిణీ కార్యక్రమం మందలపు సాయిబాబా చౌదరి ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైనటువంటి టిపిసిసి ఉపాధ్యక్షులు, కమ్మ కార్పొరేషన్ చైర్మన్, కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ స్థానికులకు గణేష్ విగ్రహాలు పంచిపెట్టారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూకట్పల్లి నియోజకవర్గం లో గణేష్ నవరాత్రి ఉత్సవాలు అట్టహాసంగా జరపటానికి ప్రతి గల్లీలో గణేష్ మండపాలు ఆయా కమిటీలు ఏర్పాటు చేస్తున్నాయని, ఈసారి సాధ్యమైనంత వరకు పర్యావరణ హితమైన విగ్రహాలు ఏర్పాటు చేయడానికి అందరూ ఆసక్తి చూపుతున్నారని ఇదొక మంచి పరిణామమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి ఎక్స్ వైస్ చైర్మన్ లక్ష్మయ్య, డివిజన్ ప్రెసిడెంట్ కిలారు శ్రీనివాస్ బాబు, చావా శ్రీనివాసరావు, వాసు, స్థానిక నాయకులు,తదితర నాయకులు పాల్గొన్నారు.

ఇ-పేపర్