తెలంగాణ

మానవత్వమే మహోన్నత సేవ.. ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడమే నిజమైన బాధ్యత.

మానవత్వమే మహోన్నత సేవ.. ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడమే నిజమైన బాధ్యత.

జనం న్యూస్ సెప్టెంబర్ 13 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడం, కష్టాల్లో ఉన్న కుటుంబాలకు ధైర్యం చెప్పడం తన బాధ్యతగా భావించే బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు మరోసారి తన మానవీయతను చాటుకున్నారు.మాజీ సింగిల్ విండో డైరెక్టర్ గునుగంటి వెంగళ్ రావు అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న వడ్డేపల్లి రాజేశ్వరరావు ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా వెంగళ్ రావు ఆరోగ్య పరిస్థితిని, ప్రస్తుతం అందుతున్న వైద్య చికిత్సను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు.అనారోగ్యంతో బాధపడుతున్న వెంగళ్ రావును ఆప్యాయంగా పలకరించి, ధైర్యంగా ఉండాలని సూచించారు. అనంతరం వారి కుటుంబ పరిస్థితిని తెలుసుకుని ఆర్థిక సహాయాన్ని అందజేశారు. కష్టకాలంలో కుటుంబం ఒంటరిగా లేదని, తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తానని రాజేశ్వరరావు గారు కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు.“వెంగళ్ రావు త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుని తిరిగి మనందరితో కలిసి సంతోషంగా ఉండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎలాంటి అవసరం వచ్చినా, ఏ సమయంలోనైనా నన్ను సంప్రదించవచ్చు.నా వంతు సహాయ సహకారాలు అందించేందుకు ఎల్లప్పుడూ ముందుంటాను” అని రాజేశ్వరరావు కుటుంబ సభ్యులకు తెలియజేసి వారికి భరోసానీ ఇచ్చారు.

ఇ-పేపర్