తెలంగాణ

గ్రామ ప్రజలు తస్మాత్ జాగ్రత్త.

గ్రామ ప్రజలు తస్మాత్ జాగ్రత్త.

అధిక వడ్డీ ఆశ చూపించి డబ్బులు తీసుకుని మోసం చేస్తున్న ఇటుక బట్టీల నిర్వాహకులపై అప్రమత్తత అవసరం

జనం న్యూస్ సెప్టెంబర్ 15 తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్: శ్రీనివాస్ రెడ్డి మాడుగులపల్లి మండల పరిధిలోని గండ్రవాణిగూడెం గ్రామంలో ఇటుక బట్టీల వ్యవహారం రోజు రోజు కూ విస్తరిస్తుండటంతో పాటు, గ్రామ ప్రజలు తమ డబ్బుల విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో ఒకటి, రెండు మాత్రమే కనిపించిన ఇటుక బట్టీలు ప్రస్తుతం క్రమంగా పెరిగినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. గ్రామంలోని సారవంతమైన వ్యవసాయ భూములను సాగు చేసుకుంటే వచ్చే ఆదాయం కంటే ఇటుక బట్టీలకు భూములను అద్దెకు ఇవ్వడం ద్వారా అధిక మొత్తంలో ఆదాయం వస్తుందనే ఆశతో కొందరు రైతులు తమ భూములను బట్టీల నిర్వాహకులకు అద్దెకు ఇస్తున్నారని తెలుస్తోంది. అయితే ఇటుక బట్టీల చుట్టూ చోటుచేసుకుంటున్న ఆర్థిక లావాదేవీల విషయంలో మాత్రం గ్రామ ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.అధిక వడ్డీ ఆశ చూపి డబ్బుల సేకరణ?గ్రామంలో కష్టపడి కూలీ పనులు చేసుకుంటూ, చిన్నపాటి వ్యవసాయం చేసుకుంటూ పైసా పైసా కూడబెట్టుకున్న కొందరు ప్రజలను అధిక వడ్డీ ఇస్తామనే ఆశ చూపించి కొంతమంది ఇటుక బట్టీల నిర్వాహకులు డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొదట్లో సమయానికి వడ్డీ చెల్లిస్తూ నమ్మకం కలిగించి, అనంతరం అసలు డబ్బులు అడిగినప్పుడు రేపు, మాపు అంటూ కాలయాపన చేస్తున్నారని కొందరు గ్రామస్తులు వాపోతున్నారు.డబ్బులు తిరిగి ఇవ్వాలని పదేపదే అడిగినప్పటికీ సరైన సమాధానం ఇవ్వకుండా తప్పించుకోవడం, చివరకు ఫోన్‌ ద్వారా కూడా అందు బాటులో లేకుండా పోవడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు.ఒకరి ఘటనతో మరింత ఆందోళనఇటీవల గ్రామ ప్రజల వద్ద నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ ఇటుక బట్టీ నిర్వాహకుడు గ్రామం నుంచి వెళ్లిపోవడంతో, డబ్బులు ఇచ్చిన పలువురు ప్రజలు ఆందోళనకు గురవు తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మరికొందరు ఇటుక బట్టీల నిర్వాహకుల విషయంలోనూ ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందేమోనన్న అనుమానాలు గ్రామ ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి.డబ్బులు ఇచ్చే ముందు జాగ్రత్త తప్పనిసరి
కష్టపడి సంపాదించిన డబ్బును అధిక వడ్డీ వస్తుందనే ఆశతో ఎవరికైనా అప్పగించే ముందు పూర్తి వివరాలు తెలుసు కోవాలని గ్రామ పెద్దలు, ప్రజా ప్రతినిధులు సూచిస్తున్నారు. డబ్బులు ఇచ్చే సందర్భంలో రాతపూర్వక ఒప్పందం, హామీ పత్రాలు, బ్యాంకు లావాదేవీల ఆధారాలు తప్పనిసరిగా ఉంచుకోవాలని, వ్యక్తులపై నమ్మకంతో మాత్రమే పెద్ద మొత్తంలో నగదు ఇవ్వకూడదని సూచిస్తున్నారు.కష్టపడి సంపాదించిన ప్రజల డబ్బు ఒక్కసారిగా పోతే కుటుంబాలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అందుకే అధిక వడ్డీ ఆశ చూపించే వారి విషయంలో గ్రామ ప్రజలు తస్మాత్ జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.

ఇ-పేపర్