రామకృష్ణ వెల్ఫేర్ అసోసియేషన్ – గణేష్ ఆర్కే యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో నిర్వహణ
జనం న్యూస్ సెప్టెంబర్ 15 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి కూకట్‌పల్లి నియోజకవర్గ పరిధిలోని వివేకానంద నగర్ డివిజన్ రామకృష్ణ వీధిలో శ్రీ గణపతి వినాయక నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. రామకృష్ణ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు గణేష్ ఆర్కే యూత్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలకు కాలనీవాసులు, భక్తులు పెద్ద ఎత్తున హాజరై భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.ఈ సందర్భంగా సంఘ అధ్యక్షులు జనంపల్లి పురంధర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం కాలనీవాసుల సహకారంతో వినాయక నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. సమాజంలో ఐక్యత, ఆధ్యాత్మిక చైతన్యం పెంపొందించడమే ఈ ఉత్సవాల ప్రధాన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో యూత్ కమిటీ సభ్యులు నందు, అశ్విత్, రోహిత్, రిత్విక్, డాక్టర్ క్రాంతి కుమార్, కళ్యాణ్, చంగల్ రెడ్డి, జి. ప్రసాద్, లక్ష్మీనారాయణ, వెంకటేశ్వరరావు, శ్రీనివాసరావు, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. మహిళా భక్తులు మంజుల, లక్ష్మి, అన్నపూర్ణ, సుభాషిణి, సునీత, కరుణతో పాటు కాలనీవాసులు సుమారు 500 మంది మహిళలు, పిల్లలు, పెద్దలు స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. అనంతరం తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.ప్రతి రోజు సాయంత్రం 7:30 గంటల నుండి ప్రత్యేక పూజలు, భజనలు నిర్వహిస్తున్నామని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ వినాయక స్వామివారి ఆశీస్సులు పొందాలని నిర్వాహకులు కోరారు.ఈ సందర్భంగా ఉత్సవాల విజయవంతానికి సహకరించిన కమిటీ సభ్యులు, యూత్ సభ్యులు, మహిళలు, భక్తులందరికీ అధ్యక్షులు జనంపల్లి పురంధర్ రెడ్డి పేరుపేరునా ప్రత్యేక అభినందనలు తెలిపారు.