జనం న్యూస్ 15/09/2026 ఈ సందర్భంగా కౌన్సిలర్ పట్లూరి శివశేఖర్ మాట్లాడుతూ జోగిపేట మున్సిపాలిటీలో గణపతి మండపాల ద్వారా భక్తి ఐక్యత సామాజిక చైతన్యం పెంపొందించే కార్యక్రమాలు నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరిని అభినందిస్తున్నాను వినాయకుని ఆశీస్సులతో జోగిపేట మున్సిపాలిటీ పరిధిలో పాడిపంటలు సమృద్ధిగా పండాలని పల్లెలు సిరిసంపదలతో కళకళలాడాలని ఆకాంక్షించారు నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లభించాలి ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రంగంపేట కుమార్, ఠాకూర్ శ్రీనివాస్, డాకురి అశోక్, ఆకుల శంకర్, డాక్టర్ సోమప్ప, మనీ పవన్, సత్యం, రాజు, బరుడి వీరేశం, నాగులపల్లి యాదగిరి, డాకూరి అంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.