తెలంగాణ

టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌కు శుభాకాంక్షలు

టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌కు శుభాకాంక్షలు

జనం న్యూస్ సెప్టెంబర్ 15 తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్: శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు స్వీకరించి రెండు సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా కూకట్‌పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు మంగళవారం ఉదయం గాంధీభవన్‌లో ఆయనను మర్యాదపూర్వకంగా కలసి ఘనంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ, మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో పార్టీని బలోపేతం చేసేందుకు కృషి జరుగుతోందని పేర్కొన్నారు. కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు.అనంతరం మహేష్ కుమార్ గౌడ్‌కు శుభాకాంక్షలు తెలియజేసి, భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయిలో ప్రజలకు, పార్టీకి సేవలందించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో కూకట్‌పల్లి నియోజకవర్గ ఏ-బ్లాక్ అధ్యక్షులు డాక్టర్ పి. నాగిరెడ్డి, డివిజన్ అధ్యక్షులు చందర్ రావు, పులి శివకుమార్ గౌడ్, అరవింద్ కుమార్, సాహెబ్ షెహంషా, క్రాంతి కుమార్, రాము, వెంకటేష్ యాదవ్, పాల్గన్ రావు, జహంగీర్ తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొని మహేష్ కుమార్ గౌడ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

ఇ-పేపర్