కోరుట్ల నియోజకవర్గంలో 44 మంది లబ్ధిదారులకు రూ.8.50 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్
జనం న్యూస్, సెప్టెంబర్ 15, జగిత్యాల జిల్లా : కోరుట్ల : కష్టకాలంలో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) భరోసాగా నిలుస్తోందని కోరుట్ల ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్ అన్నారు.కోరుట్లలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం కోరుట్ల పట్టణం, కోరుట్ల మండలానికి చెందిన సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మొత్తం రూ.8,50,000 విలువైన 44 సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్ లబ్ధిదారులకు అందించారు.అనారోగ్యంతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ వైద్య ఖర్చులు భరించలేని పరిస్థితుల్లో ఉన్న కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ ద్వారా అందుతున్న ఆర్థిక సహాయం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ సహాయాన్ని అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ప్రజల ఆరోగ్యం, సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, ఆర్థిక ఇబ్బందుల కారణంగా వైద్యం అందక ఎవరూ ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో సీఎంఆర్ఎఫ్ ద్వారా అర్హులకు సహాయం అందిస్తున్నట్లు తెలిపారు.చెక్కులు అందుకున్న లబ్ధిదారులు ఎమ్మెల్యే డా. సంజయ్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారుల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.