తెలంగాణ

విద్య రంగ సమస్యల ను గాలికి వదిలేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎస్ ఎఫ్ ఐ జిల్లా కార్యదర్శి శ్రీకాంత్

విద్య రంగ సమస్యల ను గాలికి వదిలేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎస్ ఎఫ్ ఐ జిల్లా కార్యదర్శి శ్రీకాంత్

జనం న్యూస్ సెప్టెంబర్ 15 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి హన్మకొండ జిల్లా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ప్రభుత్వ రంగ సమస్యలను గాలికి వదిలేసారని ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా కార్యదర్శి మంద శ్రీకాంత్ అన్నారు మంగళవారం రోజున హనుమకొండ నగరంలోని కాకతీయ డిగ్రీ కళాశాల నూతన కమిటీ ని ఎన్నుకున్నారు ఈ సందర్భంగా మంద శ్రీకాంత్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మూడు సంవత్సరాలు దగ్గర కి వస్తున్న కూడా ప్రభుత్వ విద్యా రంగ సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా ప్రభుత్వం విఫలమైందన్నారు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్ ఫీజు రియంబర్స్ మెంట్ పూర్తి స్థాయిలో విడుదల కాకపోవడంతో తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారన్నారు వారి సొంత డబ్బులు కట్టి సర్టిఫికెట్స్ తీసుకునే పరిస్థితి రాష్ట్రంలో ఉందన్నారు అలాగే ఇదే కాకతీయ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు సరిపడ తరగతి గదులు భవనాలు లేకపోవడంతో పొద్దున మధ్యాహ్నం షిఫ్ట్లు వైసుగా డిగ్రీ విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులు పడుతూ చదువుకోవలసి వస్తుందన్నారు తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద ప్రభుత్వ డిగ్రీ కళాశాలగా పేరుపొందిన కేడీసీ కళాశాలలో ఇలాంటి ఇబ్బందులు ఉండడం చాలా బాధాకరమన్నారు వెంటనే స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి వెంటనే కాకతీయ డిగ్రీ కళాశాల కు నూతన భవనాలను నిర్మించాలన్నారు అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 8 వేల కోట్ల దాకా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్ ను ఫీజు రీయంబర్స్మెంట్నును వెంటనే విడుదల చేయాలి అన్నారు లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేస్తామని ఈ సందర్భంగా వారు కాంగ్రెస్ ప్రభుత్వం అని హెచ్చరించారు ఎస్ఎఫ్ఐ కేడీసీ డిగ్రీ కళాశాల నూతన కమిటీ ఎన్నిక అధ్యక్షులుగా ఆర్ ,పవన్ కుమార్, కార్యదర్శిగా , భాను ప్రసాద్, ఉపాధ్యక్షులుగా, కార్తీక్ గణేష్,చరణ్, సహాయ కార్యదర్శులుగా , శివ కుమార్ ,పార్థు, కమిటీ సభ్యులుగా, అజాద్, హర్ష, భారత్ ,విష్ణు,వర్ధన్, వంశీ , ఎన్నుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి బిరెడ్డి జశ్వంత్ జిల్లా కమిటీ సభ్యులు చెన్నూరి సాయికుమార్ ,నాగరాజ్ , విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

ఇ-పేపర్