వైరల్ వార్తలు

జుక్కల్‌లో ఘనంగా తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం*

జుక్కల్‌లో ఘనంగా తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం*

జుక్కల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ

జుక్కల్, సెప్టెంబర్ 17 జనం న్యూస్ తెలంగాణ చరిత్రలో కీలకమైన సెప్టెంబర్ 17ను రాష్ట్ర ప్రభుత్వం “తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం” గా అధికారికంగా నిర్వహిస్తోంది. 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనం కావడంతో ప్రజాస్వామ్య పాలనకు మార్గం సుగమమైన చారిత్రక ఘట్టాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ తోట లక్ష్మీకాంతరావు గారు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు శ్రీ ఏలే మల్లికార్జున్ గారు పాల్గొని జాతీయ జెండాకు గౌరవ వందనం సమర్పించారు.ఈ సందర్భంగా 1948 సెప్టెంబర్ 17న ప్రజాస్వామ్య పాలనకు నాంది పలికిన చారిత్రక ఘట్టాన్ని, ప్రజల హక్కులు, స్వేచ్ఛ, ఆత్మగౌరవం కోసం పోరాడిన రైతులు, కార్మికులు, విద్యార్థులు, మహిళలు, సామాన్య ప్రజలు, అమరవీరుల త్యాగాలను వారు స్మరించుకున్నారు.స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ తెలంగాణ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

ఇ-పేపర్