జనం న్యూస్ -సెప్టెంబర్ 17- నాగార్జునసాగర్ టౌన్- నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ- ఆంధ్ర రాష్ట్రాల సరిహద్దులోని నాగార్జునసాగర్ కొత్త వంతెన పై జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి పొంది స్వతంత్ర భారతదేశంలో తెలంగాణ భాగమైన చారిత్రాత్మక రోజునుస్పరించుకుంటూ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ జాతీయ సమైక్యత దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నామని అన్నారు.రాబోయే రోజులలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన పోయి బిఆర్ఎస్ ప్రభుత్వపాలన రావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నందికొండ మున్సిపాలిటీ బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.