తెలంగాణ

విద్యార్థిపై చేయి చేసుకున్న ఘటనపై ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం క్షమాపణ.

విద్యార్థిపై చేయి చేసుకున్న ఘటనపై ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం క్షమాపణ.

జనం న్యూస్ : వనపర్తి డివిజన్ రీపోటర్ కటికల శివకుమార్ వనపర్తి జిల్లా పెబ్బేరు18-09-2026 శుక్రవారం మున్సిపల్ కేంద్రంలోని ఓ ప్రవేట్ పాఠశాలలో విద్యార్థిపై చేయి చేసుకున్న ఘటనకు సంబంధించి మేనేజ్‌మెంట్ మురళీధర్ రెడ్డి స్పందిస్తూ హిందూ సంఘాల నాయకులు, హిందూ బంధువులు మరియు ఈ ఘటనతో మనోభావాలు దెబ్బతిన్న ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక క్షమాపణలు తెలిపారు. పాఠశాలలో జరిగిన ఈ ఘటన తప్పేనని, పిల్లలపై ఎప్పుడు చేయి చేసుకోమని ఆయన స్పష్టం చేశారు. ఈ ఘటన వల్ల హిందూ సంఘాల నాయకులు, హిందూ సమాజ సభ్యులు మరియు విద్యార్థి కుటుంబ సభ్యుల మనోభావాలు బాధపడ్డందుకు ఇకపై పాఠశాలలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పూర్తి జాగ్రత్తలు తీసుకుంటామని, విద్యార్థుల పట్ల మరింత బాధ్యతాయుతంగా, గౌరవంగా వ్యవహరించేలా ఉంటామని హామీ ఇచ్చారు. జరిగిన తప్పును అర్థం చేసుకున్నాం. ఈ ఒక్క ఘటనను ఇక్కడితో ముగించి, తమను క్షమించి వదిలేయాలని హిందూ సంఘాల నాయకులు, హిందూ బంధువులు మరియు మీడియా పెద్దలకు ప్రతి ఒక్కరినీ మనస్ఫూర్తిగా కోరుతున్నాం” అని మురళీధర్ రెడ్డి ఏబీవీపీ ఆధ్వర్యంలో వీడియో రిలీజ్ చేశారు.

ఇ-పేపర్