జనం న్యూస్ సెప్టెంబర్ 18 ముమ్మిడివరం ప్రతినిధి( గ్రంధి నానాజీ) డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాఐ.పోలవరం మండలం టి.కొత్తపల్లి సామాజిక ఆరోగ్య కేంద్రం వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 75వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్, ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి వేడుకల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తూ ప్రజా సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న నరేంద్ర మోదీ వంటి గొప్ప నాయకుడు దేశ ప్రధానిగా ఉండటం మనందరి అదృష్టమని పేర్కొన్నారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సంపూర్ణ ఆయురారోగ్యాలు, దీర్ఘాయుష్షు కలగాలని ఆకాంక్షించారు.దేశ ప్రగతి, ప్రజా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపడుతున్న కార్యక్రమాలు దేశ ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తున్నాయని అన్నారు.ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ ప్రజలకు మెరుగైన పాలన అందించేందుకు కృషి చేస్తోందని తెలిపారు.రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాలకు కృతజ్ఞతలు తెలుపుతూ భవిష్యత్తులోనూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహకారం, మార్గదర్శకత్వం ఇదే విధంగా కొనసాగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గుత్తుల సాయి, స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, వైద్య సిబ్బంది, అభిమానులు పాల్గొని వేడుకలను ఘనంగా నిర్వహించారు.భారతీయ జనతా పార్టీ నాయకులు వత్సవాయి రామకృష్ణం రాజు, సక్కిరెడ్డి శ్రీను ఐ.పోలవరం మండల ప్రెసిడెంట్, రాయపురెడ్డి భైరవమూర్తి జిల్లా కార్యవర్గ సభ్యులు, రాజేంద్ర ప్రసాద్, గురాల కృష్ణ కుమారి, పోతుల కృష్ణ, గాళిదేవర దుర్గారావు, ఈశ్వరరావు, సంకెట్టి కుమార్ తదితరులు పాల్గొన్నారు.