తెలంగాణ

దళితులకు రైతులకు నీళ్లు ఇవ్వకుండా అడ్డుకుంటున్న గ్రామ సర్పంచ్

దళితులకు రైతులకు నీళ్లు ఇవ్వకుండా అడ్డుకుంటున్న గ్రామ సర్పంచ్

జనం న్యూస్ 18 సెప్టెంబర్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ జోగుళాంబ గద్వాల జిల్లా వెంటనే దళితులకు ఎర్రకుంట కు నీళ్లు విడుదల చేయాలని భీమ్ ఆర్మీ జిల్లా అధ్యక్షులు మేల్లచెరువు వర్షిత్ డిమాండ్ గద్వాల్ మండలం మేళ్లచెరువు గ్రామం లో ఉన్న రైతులు ఎర్రగుంట చెరువుకు నీళ్లు ఇవ్వాలని గత పది రోజుల క్రితం ఎమ్మెల్యే ని కలెక్టర్ ని సంబంధిత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులను కలిసి వినతిపత్రం ఇచ్చి 99 డి కాల్వ నుండి మేల్లచెరువు లో ఉన్న ఎర్రగుంట చెరువుకు నీళ్లు విడుదల చేయాలని కోరడం జరిగింది అయితే వాళ్ళు స్పందించి వెంటనే నీళ్లు విడుదల చేసుకోవాలని గ్రామ సర్పంచ్ కె రాముడు మరియు రైతులకు చెప్పడం జరిగింది అందుకు సర్పంచ్ 99 డి కాల్వ నుండి ఎర్రగుంట చెరువు నీళ్లు తీసుకురావడం జరిగింది అయితే బీసీ కాలనీ కి సంబంధించిన చెరువులకు మాత్రమే నీళ్లు నింపి ఎస్సీ కాలనీకి చెందిన చెరువులను నీళ్లు నింపకుండా రెండు మూడు నెలల తర్వాత నింపుతానని అంటున్నారు అయితే ఇప్పుడే పంట చేతికి వచ్చింది నీళ్లు లేక ఎండిపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వర్షాలు లేక ఇబ్బందులతో అప్పు తెచ్చిన డబ్బులతో పెట్టుబడి పెట్టి ఇప్పుడు పంట చేతికి వచ్చిన నీళ్లు రాకుంటే పూర్తిగా నష్టపోయి అప్పుల పాలై ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వెంటనే సంబంధిత అధికారులు చర్యలు తీసుకొని దళిత రైతులను ఆదుకోవాలని భీమ్ ఆర్మీ డిమాండ్ చేస్తుంది

ఇ-పేపర్