జనం న్యూస్ 18 సెప్టెంబర్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ టి పి సి సి అధికార ప్రతినిధి మరియు మీడియా కమ్యూనికేషన్ చైర్మన్ సామ రామోహన్ రెడ్డి టి జి పి యస్ సి ఛైర్మన్ బుర్రా వెంకటేశం మరియు టి జి పి యస్ సి సెక్రటరీ హరిత ఐ ఎ ఎస్ కలిసి రాష్ట్రంలోని నిరుద్యోగుల ఉద్యోగ నోటిఫికేషన్లు అలాగే దివ్యాంగ నిరుద్యోగులకు సంబంధించిన బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీ అంశాన్ని వారి దృష్టికి తీసుకెళ్లారు అదేవిధంగా దివ్యాంగుల సంక్షేమ శాఖ సెక్రటరీ శృతి ఓజా ఐ ఎ ఎస్ దృష్టికి కూడా ఈ సమస్యను తీసుకెళ్లడం జరిగింది.ఈ సందర్భంగా టి జి పి యస్ సి అధికారులు స్పందిస్తూయ బ్యాక్లాగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఖాళీల వివరాలు వివిధ శాఖల నుంచి, అలాగే ప్రభుత్వ అనుమతులు అందిన వెంటనే దివ్యాంగుల బ్యాక్లాగ్ ప్రత్యేక నోటిఫికేషన్ జారీ చేసే ప్రక్రియ చేపడతామని తెలియజేశారు.ఈ సందర్భంగా నిరుద్యోగ పక్షపాతి దివ్యాంగ నిరుద్యోగుల సమస్యలను చొరవతో సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లిన టి పి సి సి అధికార ప్రతినిధి మరియు మీడియా & కమ్యూనికేషన్ చైర్మన్ సామ రామోహన్ రెడ్డి దివ్యాంగ నిరుద్యోగుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. **
