ఆంధ్రప్రదేశ్

ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా మావుళ్లమ్మ ఆలయం లో & మందాకిని శక్తి పీఠంలో ఆశీర్వచన దీపాలు

ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా మావుళ్లమ్మ ఆలయం లో & మందాకిని శక్తి పీఠంలో   ఆశీర్వచన దీపాలు

జనం న్యూస్ సెప్టెంబర్ 18 ముమ్మిడివరం ప్రతినిధి( గ్రంధి నానాజీ) డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకాట్రేనికోన: ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ పిలుపు మేరకు మావుళ్లమ్మ తల్లి ఆలయం, మందాకిని శక్తిపీఠంలో ఆశీర్వచన దీపాలు వెలిగించారు.మండల సేవా సంకల్ప్ అభియాన్ కన్వీనర్ పోలవరపు వీర వెంకట సత్యనారాయణ, & డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ట్రెజరర్ గ్రంధి నానాజీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నరేంద్ర మోదీ గత 25 ఏళ్లుగా 13 ఏళ్లు ముఖ్యమంత్రిగా, 12 ఏళ్లు ప్రధానిగా దేశానికి ఎనలేని సేవలందిస్తూ సకారాత్మక మార్పులతో ప్రపంచంలో భారత్ ను విశ్వగురువుగా నిలిపారని అన్నారు.ఈ కార్యక్రమంలో , సంసాని నాగరాజు, గణేష్, కె.కిరణ్, కోటిపల్లి సత్యనారాయణ, కోటపల్లి కుమారి ధనలక్ష్మి, మల్లీశ్వరి సత్య, భ్రమరాంబిక, ఎల్లమెల్లి నాగలక్ష్మి, నూకాలమ్మ తదితరులు పాల్గొన్నారు.

ఇ-పేపర్