తెలంగాణ

సర్(SIR) పై విచారణ

సర్(SIR) పై విచారణ

జనం న్యూస్ జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండలం కోడిచీర గ్రామంలో గురువారం రోజు ఏ ఈ ఆర్ ఓ & తహసిల్దార్ ముజీబ్ ఆధ్వర్యంలో సర్ నోటిస్ ఇచ్చిన వారి వివరాలు పైన స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు.సర్ నోటీసులు వచ్చిన వారు గ్రామపంచాయతీ కార్యాలయంలో విచారణ కొనసాగుతుందని గురువారం నాడు కోడిచీర గ్రామంలో ప్రత్యేక డ్రైవ్ కార్యక్రమం నిర్వహించి నోటీసు వచ్చిన వారికి అవగాహన కల్పిస్తూ వాటికి సంబంధించిన పత్రాలను జత చేసి గ్రామపంచాయతీ కార్యాలయంలోని బిఎల్ఓ కు సమర్పించాలని ప్రజలను కోరినారు. నోటీసు వచ్చిన వారు వెంటనే స్పందించి ఓటరు జాబితా సవరణ చేసుకోవాలని ఎలాంటి అవకతవకలు రాకుండా ముందస్తుగా పత్రాలు సమర్పించి బిఎల్ఓ కు సహకరించాలని కోరినారు. నోటీసు వచ్చిన వారు స్పందించకుంటే నిర్లక్ష్యంగా ఇంకా చివరి రోజు వరకు ఎదురు చూడకుండా త్వరలోనే పూర్తి చేసుకోవాలని తెలిపారు. నిర్లక్ష్యంగా వ్యవహరించి నోటీసు అందిన వారు బి ఓ లో కు సంబంధిత పత్రాలు సమర్పించకుంటే ఓటరు జాబితా నుండి ఓట్లు తొలిగే పోయే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి రాజ్ కుమార్, నాయబ్ తాసిల్దార్ శివరామకృష్ణ, రెవిన్యూ అధికారులు రవి, బాలరాజ్ గ్రామస్తులు పాల్గొన్నారు తదితరులు పాల్గొన్నారు.

ఇ-పేపర్