వైరల్ వార్తలు

రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ ని సన్మానించిన దళిత జర్నలిస్టు ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బిజ్వారం ఎస్.తిరుమలేష్ జిల్లా ఉప సర్పంచ్ ల సంఘం మాజీ అధ్యక్షుడు పాల్వాయి ఎస్.రంజిత్ కుమార్

రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ ని సన్మానించిన దళిత జర్నలిస్టు ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బిజ్వారం ఎస్.తిరుమలేష్ జిల్లా ఉప సర్పంచ్ ల సంఘం మాజీ అధ్యక్షుడు పాల్వాయి ఎస్.రంజిత్ కుమార్

జనం న్యూస్ 20 సెప్టెంబర్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా డాక్టర్ విష్ణువర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల్ జిల్లా రేపల్లె దళిత రంగముణి కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం ప్రకటించిన రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ కు కృతజ్ఞతలు ఎస్.తిరుమలేష్ దళిత జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన జిల్లా ఉన్నతాధికారుల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యను దళిత జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బిజ్వారం ఎస్.తిరుమలేష్,జిల్లా ఉపసర్పంచ్‌ల సంఘం మాజీ అధ్యక్షుడు పాల్వాయి ఎస్. రంజిత్ కుమార్ కలిసి శాలువాతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా ఎస్. తిరుమలేష్ మాట్లాడుతూ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య రేపల్లె గ్రామంలోని దళిత రంగముణి కుటుంబాన్ని పరామర్శించి, ప్రభుత్వపరంగా ఆదుకునేందుకు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా సమక్షంలో ప్రభుత్వ ఉద్యోగం ప్రకటించినందుకు ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యకు కృతజ్ఞతలు తెలిపారు. బాధిత కుటుంబానికి తగిన నష్టపరిహారం అందించడంతో పాటు వారికి పూర్తి రక్షణ కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్‌ను కోరారు.ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ వీరితో మాట్లాడుతూ తప్పకుండా దళిత రంగముణి కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా అన్ని విధాల ఆదుకుంటామని భరోసా కల్పించారు

ఇ-పేపర్