
జనం న్యూస్: 19-09-2026 ముమ్మిడివరం ప్రతినిధి (గ్రంధి నానాజీ) డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం కుండలేశ్వరం స్వామి గుడి వద్ద సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా యు.పి.సీమ మరియు వైద్య బృందం మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు.115 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు.బీపీ, షుగర్ మరియు వ్యాధి నిర్ధారణపై అవగాహన కల్పించారు.6 ఏళ్లు పైబడిన వారికి మందులు పంపిణీ చేశారు.ఆహారం పట్ల అవగాహన కల్పించారు.ప్రతి 14 నుండి 49 సంవత్సరాల లోపు వారు క్యాన్సర్ స్క్రీనింగ్ చేసుకుంటే స్త్రీలకు ప్రత్యేక అవగాహన ఏర్పాటు చేయడమైనది.ఈ స్క్రీనింగ్ ద్వారా ప్రతి స్త్రీ వ్యక్తిగతంగా టెస్ట్ చేస్తే రొమ్ము క్యాన్సర్ ని తొలి దశలో కనుగొనవచ్చునని తెలిపారు.ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా చేపట్టిన ఈ సేవా కార్యక్రమం ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ఎంతగానో ఉపయోగపడుతుందని వైద్యులు తెలిపారు.గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి శిబిరాలతో ముందస్తుగానే వ్యాధులను గుర్తించి ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించవచ్చన్నారు.సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమమునకు కుండలేశ్వరం గ్రామ పెద్దలు మరియు యు.పి.సీమ, జె.వి.రమలమ్మ సూపర్ వైజర్, రమేష్ బాబు పీహెచ్ఎన్, కె.మోహన్ సూపర్ వైజర్, ఎంఎల్హెచ్పిఎస్ మరియు ఏఎన్ఎంలు పాల్గొన్నారు.