జనం న్యూస్ సెప్టెంబర్ 19 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ అనకాపల్లి జిల్లా మునగపాక మండలం ఉమ్మలాడ గ్రామం నకు చెందిన సూరిశెట్టి రామకృష్ణ (ఎస్ ఆర్) కు ఉద్యానవనం శాఖ కన్వీనర్ గా పదవి బాధ్యతలను రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆడారి ఆనంద్ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేష్ చేతుల మీదుగా బాధ్యతలను స్వీకరించడం జరిగింది. రామకృష్ణ మాటల్లో ఉమ్మలాడ గ్రామ ప్రజల ఆశీస్సులతో గ్రామ అభివృద్ధే ధ్యేయంగా ఎన్నో అభివృద్ధి పనులు చేసిన నన్ను గుర్తించి సూరిశెట్టి రామకృష్ణ ను నాకు ఈ పదవిని బాధ్యతలను అప్పజెప్పిన బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్, ఎంపీ సీఎం రమేష్ ,మొల్లేటి వరహా రామకృష్ణ, కిషన్ మోక్ష జిల్లా అధ్యక్షుడు శంకర్రావు, ఎలమంచిలి బిజెపి ఇంచార్జ్ రాజాని సన్యాసినాయుడు, మండల అధ్యక్షుడు మల్లకాలేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి నాగభూషణం వీరందరి సహకారంతో నాకు ఈ పదవిని ఇచ్చినందుకు వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ నాకు అప్ప చెప్పినటువంటి ఈ బాధ్యతను మనస్పూర్తిగా స్వీకరించి తదనుగుణంగా బాధ్యతగా వ్యవహరిస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో సూరిశెట్టి శ్రీనివాసరావు, బిజెపి పార్టీ గౌరవాధ్యక్షుడు, గ్రామ శాఖ అధ్యక్షుడు మొల్లేటి జగది, పల్లి గణేష్ గుద్దే గణేష్ మద్దాల రాము కరోతి విజయ్ కుమార్, సీతారాం బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు//