జనం న్యూస్ సెప్టెంబర్ 18 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం లోని కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆలయంలో భారతీయ జనతా పార్టీ నేత మోకా వెంకట సుబ్బారావు ఆధ్వర్యంలో కూటమి నేతలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించి వేద పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ప్రధాని నరేంద్ర మోదీ ఆయురారోగ్యాలతో సంపూర్ణ ఆరోగ్యంతో మరింతకాలం దేశానికి సేవలందించాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా కూటమి నేతలు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం వివిధ రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందుతోందని పేర్కొన్నారు.దేశ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం మోదీ అందిస్తున్న సేవలను కొనియాడుతూ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న పలు కార్యక్రమాలు ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తున్నాయని నేతలు పేర్కొన్నారు.ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం మరింత ప్రగతి సాధించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, అముడా చైర్మన్ అల్లాడ స్వామి నాయుడు, భారతీయ జనతా పార్టీ గుంటూరు జిల్లా ఇంఛార్జి యళ్ల దొరబాబు, పాత్రికేయులు మండేలా బాబి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేతలు మోకా వెంకట సుబ్బారావు, భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు అడపా శ్రీను, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు చిట్టూరి రాజేశ్వరి, జనసేన నేతలు సుధా చిన్న, గుంతపల్లి శీను, అడపా శివయ్య, కమడి సింహనరయన, కోల స్వామి, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.