బిచ్కుంద సెప్టెంబర్ 19 జనం న్యూస్ గత మూడు నాలుగు రోజుల నుండి ఏర్పడిన మబ్బుల వాతావరణం వల్ల సోయా పంటలు తెగుళ్లు సోకడం జరిగింది. ఈరోజు మండలంలోని పెద్ద దేవాడ గ్రామంలో తెగుళ్లు సోకిన సోయా పంటను పరిశీలించడం జరిగింది. ఆకుమచ్చ తెగులు మరియు వైరస్ తెగుళ్లను గుర్తించడం జరిగింది. ఆకుమచ్చ తెగులు నివారణకు ప్రాఫికోనజోల్ ఎకరానికి 200 ml లేదా టేబుకొనజోల్ ఎకరానికి 200 ml మరియు వైరస్ వ్యాపించే దోమ నివారణకై థయోమితగ్జామ్ మందులు ఎకరానికి 80 గ్రాములు చొప్పున పిచికారి చేసుకోవాలని రైతులకు సూచించడం జరిగింది. ఈ క్షేత్ర సందర్శనలో మండల వ్యవసాయ అధికారి అమర్ ప్రసాద్, వ్యవసాయ విస్తరణ అధికారి లక్ష్మణ్ మరియు రైతులు పాల్గొన్నారు.