జనం న్యూస్ సెప్టెంబర్ 21 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డికూకట్పల్లి నియోజకవర్గం వెంకటేశ్వర నగర్ డివిజన్ పరిధిలోని పాపిరెడ్డి నగర్లో వినాయక నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా రోడ్డు నంబర్ 7బి, 9సి, 10సి బ్లాకులతో పాటు 20సి సెంటర్ రోడ్డులో స్థానికులు ఏర్పాటు చేసిన పలు వినాయక మండపాలను వెంకటేశ్వర నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, పాపిరెడ్డి నగర్ పోటీ చేసిన అధ్యక్షుడు చిట్టిరెడ్డి శ్రీధర్ రెడ్డి సందర్శించారు.ఈ సందర్భంగా ఆయా మండపాల వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొని, ఇతర సీనియర్ నాయకులతో కలిసి భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. మండపాల నిర్వాహకులు చిట్టిరెడ్డి శ్రీధర్ రెడ్డితో పాటు ఇతర నాయకులను శాలువాల తో ఘనంగా సన్మానించారు.అనంతరం నిర్వాహకులు ఏర్పాటు చేసిన అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని చిట్టిరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాగణపతి స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, అష్టైశ్వర్యాలతో, ఆయు రారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. వినాయక ఉత్సవాలు భక్తి, ఐక్యత, సోదరభావానికి ప్రతీకగా నిలుస్తాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు చర్ల రామకృష్ణారెడ్డి, గడ్డం రాజేశ్వరరెడ్డి, ఏసిరెడ్డి భూపాల్‌రెడ్డి, మాయ రాజయ్య, సింగిరెడ్డి భూపాల్‌రెడ్డి, దొడ్ల రామిరెడ్డి, ఈరెడ్డి దేవేందర్‌రెడ్డి, రమేష్ యాదవ్, చిట్టిరెడ్డి గోపాల్‌రెడ్డి, వావిళ్ల బగ్గయ్య, మాయ బాలనర్సయ్య, డాకురి అక్కిరెడ్డి, కర్ల తిరుపతిరెడ్డి, వంగర శ్రీనివాస్‌రెడ్డి, మల్లేష్ యాదవ్, పాండుగౌడ్, చంద్రయ్య, రాజ నరసింహరెడ్డి, గోపాల్, దొడ్ల సాయిరెడ్డి, కృష్ణ, వెంకట్‌రెడ్డి, సాయి, బీవీకే శ్రీకాంత్, సంతోష్ గుప్త, రాజిరెడ్డి, రాజేందర్, మల్లేష్ మేస్త్రి, ఉపేందర్, మహేందర్‌రెడ్డి, నాగార్జున, మల్లారెడ్డి, చిన్న, వెంకట్‌రెడ్డి, అనిల్, రంగారెడ్డి, సత్యనారాయణ, శ్రీనివాస్‌రెడ్డి, శ్రీకాంత్, సుశీల్, ప్రతాప్‌రెడ్డి, రమణచారి, వెంకట్‌రెడ్డి, సునీల్, దామోదర్‌రెడ్డి, జితేందర్, హనుమంతు యాదవ్, జగన్‌రెడ్డి, రాజు, రవి తదితర నాయకులు, వినాయక మండపాల నిర్వాహకులు, స్థానికులు పాల్గొన్నారు.