జనం నువ్వు సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్. బి వీరేశం సెప్టెంబర్ 21. 09. 2026జహీరాబాద్ నియోజకవర్గం గోవింద్పూర్ గ్రామంలో శ్రీ భవాని గణేష్ ఉత్సవాల కమిటీ ఆధ్వర్యంలో గణేష్ పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. గోవింద్పూర్ గ్రామ సర్పంచ్ కవిత వెంకటేశం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పూజా కార్యక్రమానికి గ్రామ ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై గణనాథుని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించి గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పారు. గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ కవిత వెంకటేశం మాట్లాడుతూ గణేష్ ఉత్సవాలను గ్రామ ప్రజలంతా ఐక్యంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవడం ఆనందంగా ఉందన్నారు. గణనాథుని ఆశీస్సులతో గోవింద్పూర్ గ్రామ ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు సహకరిస్తున్న శ్రీ భవాని గణేష్ ఉత్సవాల కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో శ్రీ భవాని గణేష్ ఉత్సవాల కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.