జనం న్యూస్, నవంబర్ 12,అచ్యుతాపురం: అచ్యుతాపురం మండలం మడుతూరు పెట్రోల్ బంక్ జంక్షన్ వద్ద గురువారం
జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎంపీడీవో బి. చైతన్యదంపతులు గాయపడ్డారు. వైజాగ్ నుంచి అచ్యుతాపురం ఎంపీడీఓ కార్యాలయానికి వస్తుండగా వీరి కారును ఐసర్ వ్యాను బలంగాఢీకొనడంతో కారు ముందు భాగం దెబ్బతింది.గాయపడిన ఎంపీడీవో దంపతులను స్థానికులు వెంటనే అచ్యుతాపురంలోని పవన్ సాయి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.