తెలంగాణ

పేద విద్యార్థులకు శ్రీరామ్ గ్రూప్ రూ.2 కోట్ల బృహత్తర అవకాశం చైర్మన్ సీఎం సురేష్

పేద విద్యార్థులకు శ్రీరామ్ గ్రూప్ రూ.2 కోట్ల బృహత్తర అవకాశం చైర్మన్ సీఎం సురేష్

జనం న్యూస్ 12 నవంబర్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా డాక్టర్ విష్ణువర్ధన్ గౌడ్ మిషన్ 10th క్లాస్ చదువుకో తెలంగాణ పోస్టర్ ఆవిష్కరణ ఐజ మున్సిపల్ చైర్మన్ సీఎం సురేష్ చేతుల మీదుగా శ్రీరామ్ గ్రూప్ ఆధ్వర్యంలో చేపట్టిన ‘మిషన్ పదవ తరగతి క్లాస్ చదువుకో తెలంగాణ విద్యా ప్రోత్సాహక కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను ఈరోజు ఆవిష్కరించారు.ఈ సందర్భంగా సీఎం సురేష్ మాట్లాడుతూ.. పదో తరగతి విద్యార్థులు కష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించాలని, తమ ప్రతిభతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందుల కారణంగా విద్యార్థుల భవిష్యత్తుకు ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతో శ్రీరామ్ గ్రూప్ ముందుకు వచ్చి రూ.2 కోట్ల నగదు బహుమతులతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమం ద్వారా పదో తరగతిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు రాష్ట్రస్థాయి, జిల్లా స్థాయి, నియోజకవర్గ స్థాయిల్లో నగదు బహుమతులు అందించ నున్నారు. పదో తరగతి చదువుతున్న ప్రతి విద్యార్థి ఈ గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నా ఆత్మవిశ్వాసంతో చదువుతూ మంచి మార్కులు సాధించి తమ ప్రతిభను నిరూపించుకోవాలి. ఉన్నత విద్యను అభ్యసించి జీవితంలో మంచి స్థాయికి ఎదగాలని సీఎం సురేష్ ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో శ్రీరామ గ్రూప్ అధికారులు బిఆర్ఎస్ పార్టీ నాయకులు సీఎం సురేష్ మిత్రబృందం పాల్గొన్నారు

ఇ-పేపర్