తెలంగాణ

గణనాథుని నిమజ్జన ఊరేగింపు ప్రారంభించిన రోజా దేవి రంగారావు

గణనాథుని నిమజ్జన ఊరేగింపు ప్రారంభించిన రోజా దేవి రంగారావు

జనం న్యూస్ సెప్టెంబర్ 21 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి వివేకానంద నగర్ డివిజన్ రామకృష్ణ వీధుల్లో రామకృష్ణ వెల్ఫేర్ అసోసియేషన్, గణేష్ యువజన కమిటీ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన భారీ గణనాథుని నిమజ్జన కార్యక్రమం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. నిమజ్జన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కార్పొరేటర్ రోజా దేవి రంగారావు, గొట్టుముక్కల పెద్ద భాస్కర్ రావు హాజరై గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గణనాథుని నిమజ్జన ఊరేగింపును ప్రారంభించారు.ఈ సందర్భంగా భక్తులు గణపతి నామస్మరణతో సందడి చేయగా, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని నిమజ్జన ఊరేగింపును ఉత్సాహంగా నిర్వహించారు. మహిళలు, చిన్నారులు, స్థానిక కాలనీ వాసులు సైతం కార్యక్రమంలో పాల్గొని గణనాథునికి భక్తిశ్రద్ధలతో వీడ్కోలు పలికారు.కార్యక్రమంలో రామకృష్ణ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు జనంపల్లి పురంధర్ రెడ్డి, బి. శ్రీనివాసరావు, వెంకటేశ్వరరావు, చంగల్రెడ్డి, లక్ష్మీనారాయణ, శ్రీనివాస్ రెడ్డి, సుధాకర్, శ్రీధర్, సూర్యనారాయణ, వేణుగోపాల్, సుబ్బారెడ్డి, వెంకటేశ్వరరావుతో పాటు రామకృష్ణ యువజన కమిటీ సభ్యులు నందు, అశ్విత్, రిత్విక్, రోహిత్, భార్గవ్, కళ్యాణ్, సాయి తదితరులు పాల్గొన్నారు.నిమజ్జన కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సహకరించిన ముఖ్య అతిథులు, భక్తులు, వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, మహిళలు, యువజన కమిటీ సభ్యులు, స్థానిక కాలనీ వాసులు మరియు నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ జనంపల్లి పురంధర్ రెడ్డి పేరుపేరునా ప్రత్యేక అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేశారు.

ఇ-పేపర్